స్వాగతం

నిజమైన రైతు-స్నేహపూర్వక కార్యక్రమం

భారత దేశ ఆర్ధిక వ్యవస్థకు రైతులు వెన్నెముక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తూ కోట్లాది మంది కడుపు నింపుతున్న అన్నదాతల సంక్షేమం కోసం మా వంతు ప్రయత్నం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. పంట దిగుబడిని పెంచడం, పండించిన పంటను నిల్వ చేయడం, మంచి ధరకు మార్కెట్‌లో విక్రయించడం వంటి పలు విషయాల్లో అన్నదాతలకు సాయం చేసేందుకు  చొరవ తీసుకుంటున్నాం. అన్నదాతల మోములో నిత్యం చిరునవ్వు చూడాలనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నాం.

 

మా ప్రయత్నం ఏమిటంటే..

ప్రస్తుతం రైతులు అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన పంటలు సాగు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా దిగుబడి తగ్గి అన్నదాతలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. దీన్ని నివారించడం కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. నేల రకం, వాతావరణ పరిస్థితులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఏ ప్రాంతంలో ఎలాంటి పంటలు సాగుచేస్తే అధిక దిగుబడి సాధించగలం అనే దానిపై అన్నదాతలకు స్పష్టమైన అవగాహన కలిగించడం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. మా విధానాలు అనుసరించి ముందుకు సాగితే రైతులు ఒక ఎకరంలో ప్రస్తుతం సాధించే ఉత్పత్తి కన్నా గణనీయమైన స్థాయిలో దిగుబడి సాధించవచ్చు. దీంతో అన్నదాతల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. వినియోగదారుల ప్రాధాన్యతపై సర్వే నిర్వహించి ఎలాంటి పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉందనే వివరాలు సైతం మేము సేకరించాం. డిమాండ్‌కు సంబంధించి సమగ్రమైన సమాచారం మా వద్ద ఉండటంతో ఏ పంటలు ఎంత మేర సాగు చేయాలనే దానిపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం పంటల సాగుపై దృష్టి సారించిన మేము త్వరలోనే పాడి, పౌల్ట్రీ, వాటి అనుబంధ రంగాలపై సైతం దృష్టి పెట్టనున్నాం.

A truly farmer-friendly initiative

మా ప్రయత్నం ఏమిటంటే..

రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు నిపుణులతో కూడిన ఓ టెక్నికల్ టీంను ఏర్పాటు చేశాం. సాగు విషయంలో అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు మా అగ్రికల్చరల్ టీమ్ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న విధానాలను పూర్తిగా పరిశీలించి అధిక దిగుబడి సాధించడం, పెట్టుబడి వ్యయం తగ్గించడం వంటి పలు అంశాలపై మా టీం సభ్యులు అవగాహన కల్పిస్తారు. దీంతో రైతులకు అధిక ఆదాయం లభించనుంది. గిరాకీ ఎక్కువగా ఉన్న పంటలను గుర్తించి వాటిని సాగు చేసే దిశగా రైతులను ప్రోత్సహించడంతో పాటు నకిలీ విత్తనాల బెడద నుంచి వారిని రక్షించేందుకు మా టీం నిరంతరం కృషి చేస్తుంది. పంటను మార్కెట్లో అమ్మేందుకు  సులువైన మార్గాలను సూచిస్తుంది.

ఆరోగ్యవంతమైన పైరు కోసం ఆలోచనలతో కూడిన ప్రణాళిక

పైరు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ప్రణాళిక అవసరం. అలాంటి ప్రణాళిక సిద్ధం చేయడంలో మేము ముందు వరుసలో ఉంటాం. ఎరువులు, రసాయనాల వాడకాన్ని నిషేధించి పూర్తి సహజసిద్దమైన పద్దతులతో పంటలు సాగు చేసే విధంగా రైతులను తీర్చి దిద్దడమే మా ప్రధాన లక్ష్యం. ఈ విధానంతో అధిక లాభాలు గడించడమే కాకుండా రసాయనాలు లేని ఆహారాన్ని ప్రజలకు అందించే గొప్ప అవకాశం అన్నదాతలకు లభిస్తుంది. తెగుళ్ల భారి నుంచి పైరును రక్షించేందుకు గాను విత్తనం వేసినప్పటి నుంచి పూత దశ వరకు మా టీం పైరును నిత్యం పర్యవేక్షిస్తుంది. దీంతో రైతులకు నష్టం వచ్చే అవకాశం ఏ మాత్రం ఉండదు. ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా అధిక మొత్తంలో పూత రావటంతో పాటు పంట దిగుబడి గణనీయంగా ఉంటుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల పట్ల, వారికి అందజేస్తున్న రాయితీలపై చాలామందికి కనీస అవగాహన లేకపోవడంతో ప్రభుత్వాల నుంచి ఎలాంటి లబ్ధి పొందలేకపోతున్నారు. అలాంటి వారిని గుర్తించి అర్హత ఉన్న ప్రతీ రైతుకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా మా టీం సభ్యులు కృషి చేస్తారు. అవసరం ఉన్న వారికి బ్యాంకుల

నుంచి లోన్ అందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మా ప్రతినిథులు చొరవ చూపి అధికారులతో మాట్లాడుతారు.

పంటలో నాణ్యత దిశగా అడుగులు

అధిక దిగుబడి సాధించడంతోనే మనం విజయం సాధించినట్లు కాదు. పంటలో నాణ్యత అధికంగా ఉండి మార్కెట్లో మంచి ధరకు విక్రయించినప్పుడు మాత్రమే మనం నిజమైన విజయం సాధించినట్లు. దీని కోసం మా ప్రతినిథులు పైరును పలు దశల్లో పరిశీలిస్తారు.

తెగుళ్లను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పూర్తి అవగాహన కల్పిస్తారు. ఇలా చేయడం ద్వారా మనం అనుకున్న స్థాయిలో పంట నాణ్యత సాధించగలం.

పండించిన పంటను వందశాతం కొనుగోలు చేస్తాం

రైతులు తాము పండించిన పంటను మార్కెట్లో విక్రయించడంపై సరైన అవగాహన లేకపోవడంతో మంచి ధరకు అమ్ముకోలేకపోతున్నారు. దీంతో తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదనే నిస్పృహలో కూరుకుపోతున్నారు అన్నదాతలు. ఈ విధానానికి స్వస్తి పలికేందుకు మా టీం నిరంతరం కృషి చేస్తుంది. రైతులు చెమటోడ్చి పండించిన పూర్తి పంటను మంచి ధరకు అమ్మేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. దీంతో ప్రస్తుత పోటీ మార్కెట్లో కొనుగోలు దారుల కోసం నిరీక్షించే దుస్థితి నుంచి అన్నదాతలకు విముక్తి లభిస్తుంది.

అన్నదాతల ఆర్థిక సుస్థిరత దిశగా మా ఆలోచనలు

ప్రస్తుతం రైతులు పొలాల్లో శ్రమించి పని చేస్తూ పూర్తిగా పంటపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అయితే అన్నదాతలు ఆర్ధికంగా మరింత బలపడాలంటే వారి శ్రమ మాత్రమే సరిపోదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అందుకోసం నూతన వ్యవసాయ పద్ధతుల గురించి వివరించేందుకు మా టెక్నికల్ టీం సభ్యులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటారు. అధిక దిగుబడి సాధించడం కోసం అవసరమైన అన్ని విధానాలను మా టీమ్ సభ్యులు నిత్యం వివరిస్తూ

అధునాతన సాగు పద్దతులపై శిక్షణ కార్యక్రమాలు..

చాలా మంది రైతులకు సాగు విధానాలపై సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువ రకాల పంటలు పండించలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి డిమాండ్‌కు తగినట్లుగా పలు రకాల పంటలు పండించేలా రైతులను సన్నద్ధం చేస్తాం. సాగులో అవలంభించే లేటెస్ట్ టెక్నాలజీపై వారికి అవగాహన కల్పిస్తాం. దీంతో అధిక దిగుబడి సాధించడం సులువు అవుతుంది.

పైలట్ ప్రాజెక్టు

వికారాబాద్‌ జిల్లా, తాండూరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాము. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాము.

ప్రస్తుతం ప్రాజెక్టు చేపట్టిన గ్రామాలు:

Farmers
0 +
Training sessions
0
vegetable Types
0 +
KGs Yield
0 +

మీరూ మార్పుకు నాంది పలకండి

మా టీంతో కలిసి నడవండి

మా ఆలోచనలకు అనుగుణంగా అన్నదాతల కోసం పనిచేయాలనే ఆసక్తి మీకు ఉంటే ప్రజాబంధు కోఆర్డినేటర్స్ టీంలో చేరండి. మీతో కలిసి పని చేసేందుకు మా టీం సభ్యులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

మాతో కలిసి పని చేయండి

ఎన్జీఓ సంస్థలు, బీమా కంపెనీలు, ఫైనాన్స్ సంస్థలు మాతో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తే మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టవచ్చు. తద్వారా అన్నదాతలకు సాయం చేయడంలో మీరూ భాగస్వాములు కావొచ్చు.

నేరుగా పొలం నుంచే మీ ఇంటికి

కూరగాయలు, పండ్లను మీరు ఆర్డర్ చేస్తే నేరుగా పొలం నుంచే మీ ఇంటికి చేరుస్తాం. ఈ విధానం ద్వారా మీకు తాజా సరుకు అందడంతో పాటు ధర కూడా తక్కువగా ఉంటుంది.

Contact Janaki Rama Rao: 9440383864,   9154912835,    janakiramarao@prajabandhu.org