
Welcome
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాబంధు
Need for Redressal
ప్రజలు, ప్రభుత్వ విభాగాల మధ్య భారీ అంతరం ఉండటంతో ఫిర్యాదులను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది.
ఫిర్యాదులను పరిష్కరించే విషయంలో ప్రజలకు అధికారులపై పూర్తి విశ్వాసం సైతం ఉండడం లేదు. దీనికి తోడు మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రతిసారీ ప్రభుత్వ కార్యాలయాలకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారం చూపేందుకే ప్రజాబంధు వ్యవస్థను ఏర్పాటు చేశాము. ప్రజలు, ప్రభుత్వ శాఖల మధ్య సంబంధాలను బలోపేతం చేసి ప్రజా సమస్యలను, ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రజాబంధు టీం నిరంతరం కృషి చేస్తుంది.

ప్రజాబంధు యాప్ పనిచేసే విధానం
ప్రజాబంధు మొబైల్ అప్లికేషన్‌తో అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించాము. ఈ యాప్‌లో అన్ని డిపార్ట్‌మెంట్‌లకు చెందిన అధికారులు, ఉద్యోగుల పూర్తి సమాచారం ఉంటుంది. ఈ యాప్ ద్వారా మీ సమస్యలను లేదా మీ ప్రాంతానికి సంబంధించిన ఏదైనా సమస్యను సులువుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. సమస్యకు సంబంధించిన సమాచారంతో పాటు వాయిస్ మెసేజ్, ఫోటో, వీడియోలను జతచేయవచ్చు. మీరు చేసిన ఫిర్యాదులు సంబంధిత శాఖ అధికారి, సిబ్బంది మొబైల్ యాప్‌లో కనిపిస్తుంది. దీంతో సమస్య పరిష్కారం కోసం అధికారులు వెంటనే చర్యలు ప్రారంభిస్తారు. ప్రజల సౌలభ్యం కోసం ప్రజాబంధు యాప్ తెలుగులోనూ పనిచేస్తుంది.
Citizen Redressal App
How to Use App
ఫిర్యాదుల పరిష్కారంలో కీలకంగా కోఆర్డినేటర్ వ్యవస్థ
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, విద్యుత్ సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర మౌలికసదుపాయాల సమస్యల పరిష్కారానికి వివిధ ప్రభుత్వ విభాగాలతో ప్రజలను అనుసంధానం చేయడమే లక్ష్యంగా ప్రజాబంధు కోఆర్డినేటర్ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రజలు యాప్ ద్వారా వారి సమస్యను వివరించిన తర్వాత నిర్ణీత సమయంలో పరిష్కరించాలి. అందుకోసం కోఆర్డినేటర్‌లు నిరంతరం కృషి చేస్తారు. ఈ విషయంలో స్థానిక ఉద్యోగులు విఫలమైతే ఉన్నతాధికారులు స్పందించి పరిష్కరిస్తారు. సమస్య పరిష్కారంలో సుదీర్ఘ ఆలస్యం జరిగితే స్థానిక ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
సమస్య పరిష్కారమయ్యే వరకు వివిధ స్థాయిల్లో ఫిర్యాదు స్థితిని ప్రజాబంధు టీం సభ్యులు పర్యవేక్షిస్తారు. ఫిర్యాదులను యాప్‌లో నమోదు చేయడంలోనూ ప్రజాబంధు కోఆర్డినేటర్ వ్యవస్థ ప్రజలకు సహాయపడుతుంది.
ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం మండల, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే చాలా సమయం వృథా అవుతుంది. సంబంధిత అధికారి అందుబాటులో లేకపోతే పని పూర్తి అవ్వడం కోసం మళ్లీ మళ్లీ వెళ్లాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే ప్రజాబంధు మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చాము. సమస్య ఎదైనా సరే ఈ యాప్ ద్వారా ఇంట్లో నుంచే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం పొందే గొప్ప అవకాశం ప్రజలకు కల్పిస్తున్నాం.
యాప్‌తో అనుసంధానమైన ప్రభుత్వ శాఖలు
- వ్యవసాయ శాఖ
- పశుసంవర్ధక శాఖ
- విద్యాశాఖ
- విద్యుత్ శాఖ
- దేవాదాయ శాఖ
- ఎక్సైజ్ శాఖ
- అగ్నిమాపక శాఖ
- మత్స్య శాఖ
- హార్టికల్చర్
- పరిశ్రమల శాఖ
- జలవనరుల శాఖ
- గనుల శాఖ
- మున్సిపల్ శాఖ
- పంచాయతీరాజ్ శాఖ
- హోం శాఖ
- రెవెన్యూ శాఖ
- రోడ్లు, భవనాల శాఖ
- ఆర్టీసీ
- గ్రామీణ తాగునీటి శాఖ
- విద్యా సంరక్షణ మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ
- ఉపాధి హామీ పథకం
- ఇందిరా క్రాంతి పథకం
- పంచాయతీరాజ్ ఇంజనీరింగ్
మీరూ మార్పుకు నాంది పలకండి
మా టీంతో కలిసి నడవండి
మా ఆలోచనలకు అనుగుణంగా అన్నదాతల కోసం పనిచేయాలనే ఆసక్తి మీకు ఉంటే ప్రజాబంధు కోఆర్డినేటర్స్ టీంలో చేరండి. మీతో కలిసి పని చేసేందుకు మా టీం సభ్యులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
మాతో కలిసి పని చేయండి
ఎన్జీఓ సంస్థలు, బీమా కంపెనీలు, ఫైనాన్స్ సంస్థలు మాతో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తే మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టవచ్చు. తద్వారా అన్నదాతలకు సాయం చేయడంలో మీరూ భాగస్వాములు కావొచ్చు.
నేరుగా పొలం నుంచే మీ ఇంటికి
కూరగాయలు, పండ్లను మీరు ఆర్డర్ చేస్తే నేరుగా పొలం నుంచే మీ ఇంటికి చేరుస్తాం. ఈ విధానం ద్వారా మీకు తాజా సరుకు అందడంతో పాటు ధర కూడా తక్కువగా ఉంటుంది.
Contact : Jonnalagadda Venkateshwar Rao, Incharge -Tandur Assembly Constituency, Contact/ Whatsapp : +91-9392395681